Wednesday, July 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైల్లో 56మంది యువతులు… అనుమానంతో ఆరా తీస్తే ..!

రైల్లో 56మంది యువతులు… అనుమానంతో ఆరా తీస్తే ..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏకంగా 56 మంది యువతులు రైల్లో ప్రయాణిస్తున్నారు… వారివద్ద టికెట్లు గానీ, ఇతర పత్రాలు గానీ ఏమీ లేవు. వారందరి ముఖాల్లో ఆందోళన..! ఇదంతా గమనించిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గట్టిగా ఆరా తీసి అరెస్టు చేశారు. మహిళా అక్రమ రవాణాగా గుర్తించిన అధికారులు ఎట్టకేలకు ఆ యువతులందరినీ వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు..!

పూర్తి వివరాలోకి వెలితే.. సోమవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌ నుంచి బీహార్‌ కు బయలుదేరిన న్యూ జల్పారుగురి-పట్నా క్యాపిటల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 56 మంది యువతులు ఎక్కారు. వీరితో పాటు ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వీరున్న బోగీ వద్దకు వచ్చారు. యువతులంతా ఇలా ఒకేసారి ప్రయాణించడం, వారి ముఖాల్లో ఆందోళన గమనించిన రైల్వే సిబ్బందికి అనుమానం కలిగింది. వెంటనే వారిని టికెట్లు చూపించాలని అడిగారు. కానీ, వారివద్ద టికెట్లు గానీ, ఇతర పత్రాలు గానీ ఏమీ లేవు. కేవలం కోచ్‌, బెర్త్‌ నంబర్లు మాత్రమే వారి చేతులపై ముద్రించారు. దీంతో సిబ్బంది వారిని ప్రశ్నించారు.

బెంగళూరుకు చెందిన కంపెనీలో ఉద్యోగం కోసం తమను రైల్లో తీసుకెళుతున్నారని అందులోని ఓ యువతి చెప్పింది. బెంగళూరులో ఉద్యోగమైతే బీహార్‌కు ఎందుకు తీసుకెళుతున్నారని వారితో ఉన్న వ్యక్తులను సిబ్బంది ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రైల్వే సిబ్బంది వారిని అరెస్టు చేశారు. మహిళల అక్రమ రవాణాలో భాగంగానే వీరిని బీహార్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో నిర్థారణ అయ్యింది. ఆ యువతులందరినీ రక్షించిన అధికారులు వారి కుటుంబాలకు అప్పగించారు. యువతులందరూ 18-31 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -