Wednesday, March 25, 2026
E-PAPER
Homeక్రైమ్574 కిలోల గంజాయి పట్టివేత

574 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -

– ముగ్గురు అంతర్రాష్ట్ర అక్రమ రవాణాదారుల అరెస్ట్‌
– సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం : పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్‌
నవతెలంగాణ-సంగారెడ్డి

ఎస్‌-న్యాబ్‌, సీసీఎస్‌, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సుమారు రూ.2.87 కోట్ల విలువ గల 574 కిలోల నిషేధిత ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ముగ్గురు అంతర్రాష్ట్ర అక్రమ రవాణాదారులను అరెస్టు చేసి 1-కియా సోనేట్‌ కారు, డీసీఎం వాహనాలలో 287-గంజాయి ప్యాకెట్లు సీజ్‌ చేశారు. ఎస్పీ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా ఎస్‌-న్యాబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌ రావ్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్‌, సదాశివపేట ఇన్‌స్పెక్టర్‌ డి.వెంకటేశ్‌ సిబ్బందితో కలిసి సదాశివపేట బైపాస్‌ రోడ్డులో కియా సోనేట్‌ కారును తనిఖీ చేశారు. దాంతోపాటు వారి వెంట వస్తున్న డీసీఎంను తనిఖీ చేయగా అందులో 287ప్యాకెట్ల ఎండు గంజాయిని గుర్తించారు. దాని విలువ సుమారు రూ.2.87 కోట్లు ఉంటుంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, సదాశివపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. అక్రమంగా గంజాయి తరలిస్తున్న పింకు, పప్పు దాలాయి, నారాయణ ప్రసాద్‌ బెహ్రాను అరెస్టు చేసినట్టు తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను అభినందించారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను సాగు, సరఫరా చేసినా సంగారెడ్డి జిల్లా ఎస్‌న్యాబ్‌ నెంబర్‌ 8712656777కు సమాచారం అందించాలని, సమా చారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సంగారెడ్డి జిల్లా ఎస్‌-న్యాబ్‌ ఇన్‌స్పె క్టర్‌ నాగేశ్వర్‌ రావ్‌, సిబ్బంది, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివ కుమార్‌, సదాశివపేట ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశం, క్లూస్‌ టీం సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -