Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమరజీవి గుండా మల్లేష్ 5వ వర్ధంతి 

అమరజీవి గుండా మల్లేష్ 5వ వర్ధంతి 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో, గల్లీలో ఒకే మాట మాట్లాడిన సిపిఐ నేత గుండా మల్లేష్ జీవితం అంకితం చేశారు అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో అమరజీవి గుండా మల్లేష్ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారని, ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో , మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆట- పాట-మాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించారని అన్నారు.

సింగరేణి కార్మికునీగా పనిచేస్తున్న తరుణంలో AITUC కార్మిక నాయకునిగా ఎదిగి 5 సార్లు శాసన సభ్యునిగా ఎన్నికై ప్రజా, కార్మిక సమస్యలపై అసెంబ్లీ లో తన వాణిని వినిపించారని ప్రజా సమస్యలపై స్పందించి అనేక ఉద్యమాలు నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఉంటూ CPIపార్టీ అభివృద్ధికి కృషి చేశారని ఆయన కోరుకున్న సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పి.రంజిత్ కుమార్, సక్కి.సురేష్, అంజలి, రాధా కుమార్, కుశాల్, సుభోదు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -