- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని బసరా గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాంపూర్ ఏరియా తాళ్ల మండవ వద్ద కల్లుగీత కార్మిక సంఘం నాయకులు బుర్ర శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీత కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు పంజాల శ్రీనివాసు బిసి సెల్ జిల్లా కార్యదర్శి మేరుగు సత్యనారాయణ గౌడ్ గ్రామ సొసైటీ ఉపాధ్యక్షుడు దొనికల మల్లికార్జున్ గౌడ్ జక్కు వేణుగోపాల్ గౌడ్ పెరుమాండ్ల రవిగౌడ్ ఎరుకల సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -