Friday, December 19, 2025
E-PAPER
Homeజిల్లాలు6వ వార్డు మెంబర్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్..

6వ వార్డు మెంబర్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్..

- Advertisement -

విధానాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..
నవతెలంగాణ – మునుగోడు

మునుగోడు మండలంలోని గుండ్లోరిగూడెం గ్రామంలో వర్రె సింహాద్రి 6వ వార్డు సభ్యులుగా కాంగ్రెస్ మద్దతుదో గెలుపొందారు. శుక్రవారం ఆ గ్రామంలో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థికి వర్రె సింహాద్రి ఓటు వేసినందుకు కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బోల్లం మహేష్ తెలిపారు. కాంగ్రెస్ మద్దతుతో గెలుపొంది పార్టీ విధానాలకు విరుద్ధంగా, బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి కాంగ్రెస్ కు నష్టం కలిగించినందుకు కాంగ్రెస్ మండల కమిటీ ఆదేశాల మేరకు వర్రె సింహాద్రిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే సస్పెండ్ చేస్తూ.. నిర్ణయం తీసుకోవడం జరిగినట్లు తెలిపారు. పార్టీ విధానాలు అతిక్రమించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా వారు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -