నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ మద్దెల రమాదేవి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రురావత్ రమాదేవి పోలీస్ స్టేషన్ లో ఎస్సై పొదిలి వెంకన్న జాతీయ పతాకాలను ఎగురవేశారు. మండల వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్, ఐకెపి కార్యాలయంలో ఏపీఎం కొట్టే వెంకటేశ్వర్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారిని వేముల స్రవంతి నీటిపారుదుల శాఖ కార్యాలయంలో డి ఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏ డి ఈ వైవి ఆనందరావు, మండల పశు వైద్య శాలలో మండల వైద్యాధికారి ఎర్రగుంట్ల అన్వేష్ జాతీయ పతాకాలను ఎగురవేశారు.
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లింగమనేని నళిని శ్రీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక అధికారిని ఇస్లావత్ సక్కుబాయి, బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పాసంగులపాటి వెంకట పద్మావతి, బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ లింగం జ్యోతిర్మయి, బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయము నందు సర్పంచ్ బానోత్ జ్యోతి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. బోనకల్ – చొప్పకట్లపాలెం ఆటో స్టాండ్, బోనకల్ – ఖమ్మం ఆటో స్టాండ్, బోనకల్ – జగ్గయ్యపేట ఆటో స్టాండ్, బోనకల్ – వైరా ఆటో స్టాండ్ ల నందు ఎస్సై పొదిలి వెంకన్న జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. షైన్ హై స్కూల్ నందు ప్రిన్సిపాల్ అయిటిపాముల శ్వేత, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్ లు జాతీయ పతాకాలను ఎగురవేశారు.
మండల పరిషత్ తహసిల్దార్ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాలలో నాయబ్ తహసిల్దార్ అజ్మీర లక్ష్మణ్, మండల పరిషత్ కార్యాలయా సూపరిండెండెంట్ మిట్టపల్లి రవికుమార్, ఈజీఎస్ ఏపీవో బసవోజు కృష్ణకుమారి, గిర్దావర్లు జంగంగూడెం మైథిలి, షేక్ వహిద సుల్తానా, హౌసింగ్ ఏఈ వేశాల గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, టిడిపి మండల అధ్యక్షుడు రావట్ల సత్యనారాయణ, గాంధీ పదం మజర డివిజన్ కన్వీనర్ పాసాంగులపాటి కోటేశ్వరరావు, కాంగ్రెస్ బోనకల్ గ్రామ అధ్యక్షుడు తోటపల్లి స్వామి, వివిధ గ్రామాల గ్రామ పరిపాలన అధికారులు, రేషన్ డీలర్లు, మండల పరిషత్ తహసిల్దార్ కార్యాలయాల ఉద్యోగులు, పోలీస్ స్టేషన్ లో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



