నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని వివిధ గ్రామాలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల తాసిల్దార్ కార్యాలయం,ఎంపీడీవో కార్యాలయం,గ్రామపంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ ఆంజనేయులు,ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్,వివిధ గ్రామాల నూతన సర్పంచులు ఉత్సాహంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సారధ్యంలో రచించబడిన భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు.
L1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. అనంతరం పటేల్ గూడెం గ్రామంలో సుంకరి ఫౌండేషన్ చైర్మన్ సుంకరి విక్రమ్ మండల ప్రజా పరిషత్ పాఠశాల 100 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



