నవతెలంగాణ – మల్హర్ రావు
77వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపిడిఓ కార్యక్రమంలో ఎంపిడిఓ క్రాoతి కుమార్, జూనియర్ కళాశాలలో ప్రిన్స్ పాల్ విజయదేవి, కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేశ్ తోపాటు అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, రాజకీయ పార్టీలు, కుల, అంబెడ్కర్ సంఘాలు, ప్రజా సంఘాలు మూడు రంగుల మువ్వేన్నెల జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బండి స్వామి,మేకల రాజయ్య,బండారి నర్సింగం,గడ్డం క్రాoతి,అజ్మీరా సారక్క,కొండ రాజమ్మ,జంగిడి శ్రీనివాస్,అబ్బినేని లింగస్వామి,చంద్రగిరి సంపత్,రవిందర్ నాయక్,ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్,అక్కల దేవేందర్, తాళ్ల రవిందర్,వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,ఇందారపు చెంద్రయ్య,సారయ్య,తిర్రి అశోక్,జంబోజు సంధ్యారాణి-రవిందర్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,ప్రజలు,విద్యార్థులు తోపాటు వివిధ పార్టీల నాయకులు,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.



