– ఊరుకొండ మండలంలో రెపరెపలాడిన జాతీయ జెండా.
నవతెలంగాణ – ఊరుకొండ
భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ, జాతీయ సమైక్యతను, సమగ్రతను పరిరక్షిస్తూ, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభదినం సందర్భంగా ఊరుకొండ మండల కేంద్రంలో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు, ప్రజాప్రతినిధలు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు.
సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఊరుకొండ మడలంలో పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై కృష్ణ దేవ, అంబేద్కర్ సంఘం వద్ద అధ్యక్షుడు, గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ మంజుల, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో కృష్ణయ్య, మండల మహిళా సమాఖ్య ఆఫీస్ వద్ద ఏపీఎం, అంగన్వాడి కేంద్రం వద్ద ఆరుణమ్మ, నేతాజీ యువజన సంఘం వద్ద అధ్యక్షుడు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద జై భీమ్ అధ్యక్షుడు భాస్కర్, ప్రభుత్వ పాఠశాల వద్ద మదన ఉపాధ్యాయులు ఆనంద్, ఎం ఆర్ సి భవనం వద్ద రూపస్, శ్రీ వెంకట బాల్ రామయ్య ఉన్నత పాఠశాల వద్ద కరస్పాండెంట్ బాల్ రాజు, రెయిన్ బో స్కూల్ వద్ద ప్రధాన ఉపాధ్యాయులు, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ యూసుఫ్ అలీ జాతీయ జెండాలను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



