కాంగ్రెస్ 382, బీఆర్‌ఎస్ 258
శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు మంద కొడిగా సాగింది. తొలి రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆశావాహులు అంతగా ఆసక్తి చూపలేదు. ఇంకా రెండు రోజులు గడువుండటంతో పాటు నామినేషన్ వేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లను సమకూర్చుకోవడం తదితర అంశాలపైనే అభ్యర్థులు దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డులకు కేవలం 902 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 382, బీఆర్‌ఎస్ 258, బీజేపీ 169, సీపీఐ(ఎం)8, బీఎస్‌పీ7, ఏంఐఎం3, ఆప్1, ఇండిపెండెంట్లు55, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి 19 నామినేషన్లు దాఖలయ్యాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
తొలి రోజు 902 నామినేషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



