నవతెలంగాణ – కంఠేశ్వర్
జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుండి భీంగల్ వీక్లీ బజార్లో గల దక్కన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కి ఎలాంటి పర్మిషన్ లేకుండా కనీస వసతులు లేకుండా స్కూల్ ని నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జెసి కి కోరారు. అదేవిధంగా ధర్పల్లి మండల్ దుబ్బాక గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో దసరా పండుగ సందర్భంగా ఒక ఫోన్ ను తీసుకువచ్చిన కారణంగా విద్యార్థికి కనీసం పేరెంట్స్ సమావేశం నిర్వహించకుండా తీసి ఇవ్వడం సరి కాదు కావున ఆ యొక్క పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని జెసి కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు ప్రతాప్, శ్రీను, జనార్దన్, శేఖర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
దక్కన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES