- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ మరియు మండల కేంద్రాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మేల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు , లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



