Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామ మందిర నిర్మాణానికి విరాళం

రామ మందిర నిర్మాణానికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ 
మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త, రామేశ్వర్‌పల్లి వాస్తవ్యులు ముద్దసాని రాజు – మాలతి దంపతులు, వారి కుమార్తె వర్షిత, కుమారుడు రోహన్ కలిసి ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం గ్రానైట్‌తో పాటు గర్భగుడికి అవసరమైన టైల్స్‌ను విరాళంగా అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మంత్రి చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.3,36,000 అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముద్దసాని రాజు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంకం రాజు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -