- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
మండలంలోని బొడిశేట్పల్లి గ్రామ సర్పంచ్ పొట్టిగారి మల్లేశ్వరి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితురాలై అదేవిధంగా గ్రామ అభివృద్ధికి గాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సర్పంచ్ మల్లేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ నాయకులు రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -



