Monday, August 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు

జై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ తో హీరోగా పరిచయం అయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయం అందుకుని, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ,’సినిమా చూసి బయటికి వచ్చిన వారందరూ జై కృష్ణ అద్భుతంగా చేశాడని చెబుతున్నారు. యాక్షన్, పాటలు, డ్యాన్స్‌లు, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాతో జై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు. తాత, బాబాయి, నాన్న లెగసీని కొనసాగించే వ్యక్తిగా జై కృష్ణ ఎదగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నా తొలి సినిమాకు, నా పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణకు థ్యాంక్యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఘట్టమనేని అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వంద శాతం మంచి సినిమాలతో నిలబెడతాను. బాబాయ్‌ మహేష్ బాబు సినిమా చూసి నేను చాలా బాగా పెర్ఫార్మ్ చేశానని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని హీరో జై కృష్ణ చెప్పారు. నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ, ‘ఈ సినిమా నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. జై కృష్ణ ఎక్స్‌ట్రా ఆర్డినరీగా పెర్ఫార్మ్ చేశాడు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -