- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లోని కాండ్లా ఔటర్ యాంకరేజ్ సమీపంలో ఎంవీ క్‌మ్యాక్స్ ఎంపరర్, ఎంవీ ట్రూ మారినర్ అనే రెండు వాణిజ్య నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎంవీ కెమ్యాక్స్ ఎంపరర్‌లో ఉన్న 24 మంది సిబ్బందిలో 21 మందిని భారత కోస్ట్ గార్డ్ సురక్షితంగా తరలించింది. మరో ముగ్గురు నౌకలోనే ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు ప్రారంభించింది.
- Advertisement -



