నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వి. సంతకుమారన్ నాయర్ (89) కన్నుమూశారు. కేరళ కొచ్చిలోని లిసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 9.44 గంటలకు తుదిశ్వాస విడిచారు. సంతకుమారన్ నాయర్ స్వస్థలం కోతమంగలం సమీపంలోని మాథిరప్పిళ్లి. ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం లిసీ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆదివారం వచ్చిన అనంతరం మృతదేహాన్ని కోతమంగలంలోని కుటుంబ ఇంటికి తరలించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారి స్వగృహంలో బంధువులు, స్నేహితులు, అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



