నవతెలంగాణ – హైదరాబాద్ : బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎప్పుడూ ఐరోపా దేశాలను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ అలా చేయబోదని స్పష్టం చేశారు. అయితే తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ఇంధన, ఆహార భద్రతకు సహకరించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయడానికి మాస్కో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం: పుతిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



