ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
నవతెలంగాణ – పరకాల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరకాల నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామం వద్ద పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం, తెలంగాణ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర నాయకులను మించి తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



