Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవా పథకం' పురస్కారానికి ఎంపికైన సీఐ క్రాంతి కుమార్

సేవా పథకం’ పురస్కారానికి ఎంపికైన సీఐ క్రాంతి కుమార్

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘సేవా పథకం’ పురస్కారానికి పరకాల సీఐ వి. క్రాంతి కుమార్ ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో గత 20 ఏళ్లుగా అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ, తనదైన శైలిలో సేవలందిస్తున్న క్రాంతి కుమార్ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఈ అరుదైన గౌరవంతో సత్కరించింది. సుదీర్ఘ కాలంగా ఆయన ప్రదర్శిస్తున్న పనితీరు, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుత ప్రస్థానంపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఈ పురస్కారం దక్కడం పట్ల తోటి పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు సీఐ క్రాంతి కుమార్‌కు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -