నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా మారుపాక నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని బద్దం గడ్డం సంఘంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి హాజరై గ్రామ నూతన పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మారుపక నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సుదీర్ఘ కాలం పార్టీకి సేవలు అందించిన కొమ్ముల రవీందర్ గారి సేవలు కొనియాడుతూ వారి సేవలను పార్టీ ఉన్నత స్థాయిలో వినియోగించుకోవాలని కోరుతూ పార్టీ నాయకత్వానికి నాయకులు విన్నవించారు.నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్ కు అభినందనలు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు భాస్కర్, గ్రామ శాఖ నూతన అధ్యక్షులు నరేష్, మాజీ అధ్యక్షులు రవీందర్ లను నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ , ఉప సర్పంచ్ తక్కురి ముత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కురి దేవేందర్, బద్దం రాజేశ్వర్, బోనగిరి లక్ష్మణ్, బద్దం తిరుపతి రెడ్డి, సుంకరి విజయ్, బద్దం నాగేష్, తక్కురి రాజశేఖర్, దాసరి రాకేష్, సాధుల్లా, శ్రీనివాస్, నవీన్, జక్కుల అనిల్, ఆంజనేయులు, నజీర్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.



