Sunday, September 13, 2026
E-PAPER
Homeఆటలుఅభిషేక్‌ శర్మ విధ్వంసం..91 బంతుల్లో 233 రన్స్‌

అభిషేక్‌ శర్మ విధ్వంసం..91 బంతుల్లో 233 రన్స్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ పంజాబ్ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ సీనియర్‌ వన్డే మ్యాచ్‌లో అదరగొట్టే ప్రదర్శన ఇచ్చాడు. అమృత్‌సర్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ (233; 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. దీంతో మొత్తంగా అమృత్‌సర్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 533/8 రన్స్‌ చేసింది.

ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవల అభిషేక్ ఆశించిన మేరకు రాణించలేదు. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో కేవలం 11 పరుగులే చేశాడు. అంతకు ముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీస్‌ల్లో అభిషేక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతను గత 10 ఇన్నింగ్స్‌ల్లో 191 పరుగులు మాత్రమే చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -