- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని సోముగూడెం గ్రామానికి చెందిన టి. భారతి పండంటి ఆడ శిశువికి జన్మనిచింది. మొదటగా వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జన్నారంకు వచ్చారు. అక్కడి నుండి 108 వాహనంలో లక్సటిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వారు వాహనాన్ని అపి డెలివరీ ఆమెకు డెలివరీ చేశారు. ఈ క్రమంలో భారతి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిందని 108 సిబ్బంది ఈఎంటి జాడి రమేష్, పైలట్ గంగాధర్ తెలిపారు. పుట్టిన శిశువును, తల్లిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. సందర్భంగా 108 సిబ్బందిని భారతి కుటుంబ సభ్యులు అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -