Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలో మంగళవారం రోజున ఓడిపిలవంచ గ్రామానికి చెందిన ఇసునం లక్ష్మి పిడుగు పడి మరణించగ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ,ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు,అనంతరం పిడుగు పడి గాయపడిన గుమ్మలపల్లి గ్రామానికి చెందిన వారిని కలిసి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమూనూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ యం పీ పీ పంతకాని సమ్మయ్య, మాజీ సర్పంచ్ కోడి రవి కుమార్, చీమల సందీప్, మూల నరోత్తం రెడ్డి, దవు భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -