వెల్లడించిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
కూలి రేట్లు పెంచాలని రైస్ మిల్ అసోసియేషన్ కి వినతిపత్రం
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో పోరాటాల రథసారధి సిఐటియులో 300 మంది రైస్ మిల్ బార్ధాన్ కార్మికులు 32 రైస్ మిల్లుల నుండి సిఐటియులో జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేద ప్రజలకు మాత్రం ఉపాధి అవకాశాలు లేక సరైన కూలి దొరకక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. మరొకవైపు కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపటంలో కానీ వారికి భద్రత కల్పించడంలో కానీ మౌలిక సౌకర్యాలను కల్పించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందటంతో పాటు రైస్ మిల్లుల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఫలితంగా దశాబ్దాల తరబడి కనీస వేతనాల సవరణ అనేక రంగాల్లో జరగటం లేదని అన్నారు. పోరాడితేనే కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతున్నాయని అందువల్ల పోరాటానికి తమ హక్కుల సాధనకు అసంఘటిత కార్మికులైన రైస్ మిల్ బార్ధన్ కార్మికులకు సి ఐ టి యు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల కార్యాలయంలో కూలి రేట్ల పెంపుదల కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్మికులందరూ ఐక్య పోరాటాలు చేయాలని అన్నారు. సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రైస్ మిల్ బార్ధాన్ కార్మిక నాయకులకు సిఐటియు కండువాను కప్పి ఆహ్వానించడం జరిగింది. క్రమంలో రైస్ మిల్ బార్ధాన్ వర్కర్స్ యూనియన్ నాయకులు యూనియన్ అధ్యక్షులు రాము ప్రధాన కార్యదర్శి ఇమామ్ నాయకులు విజయ్, ఏస్ కే అబ్దుల్ కేధరమ్మ భాస్కర్, రైస్ మిల్ ముఖద్దం నాయకులు అజయ్, మనోజ్, శోభా భాయ్, గుడ్డు లాల్ సింగ్, బి ప్రసాద్, రింక్ బోటి లాల్ సింగ్, విజయ్, గులాబ్ చంద్ రింకు, కార్మికులు రేఖ, సునీత, విజయ్, రాజు, తదితరులతోపాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.