Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం: ఎంపీ కడియం కావ్య

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం: ఎంపీ కడియం కావ్య

- Advertisement -

కార్యకర్తల అభిప్రాయ సేకరణతోనే డీసీసీ ఎన్నిక
కాంగ్రెస్ లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు
నవతెలంగాణ -పరకాల 

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని లలితా కన్వెన్షన్ లో స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కావ్య మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడి పనిచేసిన అర్హులకు అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. యువత, మహిళలు, గిరిజనులు, అణగారిన వర్గాల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. కులం, మతం, ధనం వంటి వాటితో సంబంధం లేకుండా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు, మండల, పట్టణ డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఫ్రంటల్ ఆర్గనైజర్స్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు,వార్డు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -