Wednesday, October 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ కు చేరిన రైతు పాదయాత్ర..

ముధోల్ కు చేరిన రైతు పాదయాత్ర..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ మంగళవారం భారతీ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బాసర నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముధోల్ కు చేరుకుంది. కిసాన్ సంఘ్ ప్రతినిధులు మాట్లాడుతూ బాసర నుండి ఈ పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు సుమారు 15 వేల ఎకరాలు నీటిలో మునిగిపోయి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.

సోయా పంట ఇంటికి  వచ్చిన ఇప్పటివరకు సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా రైతులు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ముధోల్లోని పశుపతినాథ్ శివాలయంలో  బుధవారం  ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర వెళ్లి బైంసా సబ్-కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ కు వినతిపత్రం అందిస్తామని కిసాన్ సంఘ్ ప్రతినిధులు తెలిపారు. రైతే రాజు దేశానికి వెన్నముక అనే ప్రభుత్వాలు ఎటు పోయాయాని, ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరిని ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా బికేఎస్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు తెలుపుతామని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -