Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఐటీయూలో 300 మంది కార్మికుల చేరిక

సీఐటీయూలో 300 మంది కార్మికుల చేరిక

- Advertisement -

కూలి రేట్లు పెంచాలని రైస్‌మిల్‌ అసోసియేషన్‌కు వినతి

నవతెలంగాణ-కంఠేశ్వర్‌
నిజామాబాద్‌ జిల్లాలో 32 రైస్‌ మిల్లులకు చెందిన 300 మంది బార్ధాన్‌ కార్మికులు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆ యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా నూర్జహాన్‌ కార్మికులకు స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరించే విధానాలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, భద్రత, మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. తమ హక్కుల సాధనకు రైస్‌మిల్‌ బార్ధన్‌ కార్మికులకు సీఐటీయూ అండగా ఉంటుందని తెలిపారు.

అనంతరం కూలి రేట్ల పెంపు కోసం రైస్‌మిల్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైస్‌మిల్‌ బార్ధాన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రాము, ప్రధాన కార్యదర్శి ఇమామ్‌, నాయకులు విజయ్, ఎస్‌కే అబ్దుల్‌, కేధరమ్మ భాస్కర్‌, రైస్‌మిల్‌ ముఖద్దం నాయకులు అజయ్, మనోజ్‌, శోభాభారు, గుడ్డు లాల్‌ సింగ్‌, బి.ప్రసాద్‌, రింక్‌ బోటి, లాల్‌సింగ్‌, విజయ్, గులాబ్‌ చంద్‌ రింకు, కార్మికులు రేఖ, సునీత, విజయ్, రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -