– జుక్కల్ వెటర్నరీ వైద్యుడు పండరీనాథ్..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ప్రతి గ్రామాలలో పాడీ రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు తప్పకుండా వేయించాలని వెటర్నరీ వైద్యుడు పండరీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ చేతుల మీదుగా పశువులకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెటర్నరీ వైద్యుడు పండరీనాథ్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి చాలా ప్రమాదకరమైనది అనీ అన్నారు. ఈ వ్యాది వైరస్ వలన వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వ్యాధి సోకిన పశువులు మరణించడం జరుగుతుందని రైతులతో అన్నారు. వ్యాదీ లక్షణాలు పశువులకు నోటి ద్వారా జిగురుగా ద్రవం పదార్థం కారడం మరియు నోటి పూత రావడం తో పాటు కాలీ మధ్యలో సందులలో పుండ్లు ఏర్పడతాయి అని అన్నారు.
పశువులకు జ్వరం రావడంతో పాటు ఆహారం సరిగా తీసుకోకపోవడం , బలహీనంగా మారి కోలుకోలేకుండా వలన మరణం సంభవించడం జరుగుతుందని తెలిపారు. గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని మండలంలో అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభించి సెప్టెంబర్ 14 వ తేదీ వరకు రాష్ట్ర పశువైద్య శాఖ ఆదేశాలు మేరకు జిల్లా అధికారుల సమన్వయంతో మండలంలోని ప్రతి గ్రామాలలో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క పాడి రైతులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని వెటర్నరి వైద్యుడు పండరి నాథ్ సూచించారు. ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు వెటర్నరీ వైద్యుడు పండని నాథ్, గోపాల మిత్రులు , పాడీ రైతులు తదితరులు పాల్గొన్నారు.
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES