Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారమే ఆరోగ్యానికి మేలు.!

పౌష్టికాహారమే ఆరోగ్యానికి మేలు.!

- Advertisement -

ఐసిడిఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపీఓ రాధిక
నవతెలంగాణ – మల్హర్ రావు

పౌష్టికాహారంతోనే ఆరోగ్యానికి మేలని ఐడిఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక అన్నారు. బుధవారం మండలంలోని దుబ్బపేట గ్రామపరిదిలోగల కస్తూరిబ్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలో అంగన్వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మండల స్థాయి పోషన్ మాసం కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పోషకారంపై విద్యార్ధినిలకు అవగాన నిర్వహించారు. రక్తహీనత రాకుండా డ్రైఫుట్స్, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రసన్న, గర్భిణీలకు సీమంతాలు చేశారు. అనంతరం పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తదితర పోషకాహారాలను ప్రదర్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ భవాని, గంగారాం సెక్టార్ సూపర్ వైజర్ వీణ, పోషన్ అభియాన్ స్వప్న, ఏన్జీవో సమ్మయ్య, అంగన్ వాడి టీచర్లు, ఏఎన్ఎమ్స్, ఆశాలు, చిన్న పిల్లల తల్లులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -