Thursday, October 16, 2025
E-PAPER
Homeసినిమామహిళల్ని కించపరిస్తే సహించం

మహిళల్ని కించపరిస్తే సహించం

- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది రచనా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. ఎస్వీఎస్‌ ప్రొడక్షన్స్‌ శ్రీనిధి సినిమాస్‌ బ్యానర్‌ పై దైవ నరేష్‌ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ రిలీజైంది. అయితే టీజర్‌లోని డైలాగులు కొంత అసభ్యకరంగా ఉన్నాయనే కామెంట్స్‌ వినిపించాయి. అలాగే తెలంగాణ యాసను అవహేళన చేస్తూ, ఆడవారిని అవమానిస్తూ డైలాగులు ఉన్నాయంటూ మహిళా సమైక్య ప్రతినిధి బృందం ఆరోపించింది. ఈ సందర్భంగా మహిళా సమైక్య ప్రతినిధి దీపా దేవి మాట్లాడుతూ, ‘ఈ చిత్ర టీజర్‌లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి.

తెలంగాణలోని మహిళలు ఇంత నీచంగా మాట్లాడుతారా?, ఆడవారితో కూడా ఆ తరహా బూతులతో కూడిన డైలాగులు చెప్పించారు. భవిష్యత్తును ఎటు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? తెలంగాణ సంస్కతిని, సాంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత అయినప్పటికీ ఇటువంటి చిత్రాలు తీయడం చాలా తప్పు. ఈ సినిమాను విడుదల కానివ్వం. అవసరమైతే సెన్సార్‌ బోర్డును ముట్టడిస్తాం’ అని అన్నారు. మీడియా సమావేశం అనంతరం ఫిలిం ఛాంబర్‌ ముఖ్య కార్యదర్శి దామోదర ప్రసాద్‌కి ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ మహిళా సమైక్య ప్రతినిధులు దీపా దేవి, పద్మ, నీరజ, ధనమ్మ, చంద్రమ్మ, నసీమా తదితరులు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -