93పరుగుల తేడాతో ఓడిన దక్షిణాఫ్రికా
లాహోర్: తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ జట్టు 93పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు నాల్గోరోజు 189 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 2వికెట్ల నష్టానికి 51పరుగులతో బుధవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికాను షాహిన్ అఫ్రిది(4/33), నొమన్ అలీ(4/79) దెబ్బ కొట్టారు. సాజిద్ ఖాన్(2/38) కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు 183పరుగులకే ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో బ్రెవీస్(54), అర్ధసెంచరీకి తోడు రికెల్టన్(45) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నొమన్ అలీకి లభించింది. రెండో, చివరి టెస్ట్ రావల్పిండి వేదికగా 20నుంచి ప్రారంభం కానుంది. దీంతో డబ్ల్యూటిసి 2025-27 తాజా ఎడిషన్‌లో తొలి గెలుపు నమోదు చేసిన పాకిస్తాన్ జట్టు రెండో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటికి ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలవడం ద్వారా.. వందకు వంద విజయ శాతం నమోదుతో ఊహించని రీతిలో టాప్-2లోకి చేరుకుంది. ఇక ఈ పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.