- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి పూర్తిగా నిష్క్రమించనున్నాయి. అదే సమయంలో దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD తెలిపింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక తీరాలకు సమీపంలో అరేబియా సముద్రంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేసింది. ఈ నెల 20 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
- Advertisement -