Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి రైతుల ఆశలు ఆవిరి

పత్తి రైతుల ఆశలు ఆవిరి

- Advertisement -

– పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలు
– నీళ్లు నిండి తడిసి ముైద్దె.. ఎర్రబడిన పత్తి
– మండలం లో 25,000 ఎకరాల్లో సాగు
-విక్రయిద్దామంటే రూ.5000కే క్వింటాల్‌ అడుగుతున్న వ్యాపారులు
-అలా అమ్మితే పెట్టుబడి రాని దుస్థితి
– ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనాలని రైతన్నల వినతి
నవతెలంగాణ-పెద్దవూర

మండలం లో ఇటీవల కురిసిన వానలతో పత్తి పంటకు అధిక నష్టం కలిగింది. చేలల్లో నీళ్లు నిలిచి పంట మొత్తం ఎర్రబడింది. మండలం లోని గ్రామీణ ప్రాంత రైతులకు పత్తి పంట ప్రాధానమైనది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడి అధికంగా వస్తుందని రైతులు ఆశించారు. మరో పది రోజుల్లో పంట చేతికందుతుందని అనుకుంటున్న సమయంలో అధికంగా కురిసిన వానలతో పంటకు తీవ్ర నష్టం కలిగింది. తడిసిన పత్తిని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకెళ్తే రూ. ఐదు వేలకే క్వింటాల్‌ అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆందోళన చెందు తున్నారు.
తీరా పంట చేతికందే సమయంలో భారీ వర్షాలు రైతులను పూర్తిగా కష్టాల్లోకి నెట్టాయి. మండలం లో అంతకు ముందు ఏడాది మిర్చి సాగు చేశారు.దిగుబడి కూడా బాగానే వచ్చింది.ధర క్వింటాకు 18,000 నుంచీ 20,000 లు పలికింది.దాంతో గత ఏడాది అధికంగా రైతులు మిర్చి సాగు చేశారు.కాని ధర 13,000 నుంచీ 15,000 ధర ఉండడం తో ఒక్కొక్క రైతుకు 3,00,000 నుంచి 5,00,000 వరకు నష్టం వచ్చింది.కనీస పెట్టుబడులుకూడ రాలేదు.దాంతో ఈ ఏడాది మిర్చికి బదులు పత్తి ఎక్కువగా సాగు చేశారు.
మండలం లో 25,000 ఎకరాలలో పత్తి సాగు
మండలంలో ఈ ఏడాది 25,000 ఎకరాలలో పత్తి సాగు చేశారు. బట్టుగూడెం, పెద్దవూర, చలకుర్తి, వెల్మగూడెం, బసిరెడ్డిపల్లి, గర్నెకుంట, పర్వేదుల, కుంకుడు చెట్టు తండా, బోనూతల గ్రామాల్లో ఈ ఏడాది రైతులు ఎక్కువగా పత్తిసాగు చేశారు. ఈ పంట ఆశాజనకంగా ఉండడంతో తా ము చేసిన అప్పులు తీరుతాయని అన్నదాతలు భావించారు. కానీ, ఊహించని రీతిలో వర్షా లు వచ్చి రైతుల ఆశలను ఆవిరి చేశాయి. వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగినా అధికారులు మాత్రం రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. వానలకు పంట తడిసి ముైద్దె.. నలుపు రంగు లోకి మారడంతో దానిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. దీంతో రైతులు తక్కువ ధరకు అమ్ముతూ నష్టాల పాలవుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో అప్పులను ఎలా తీర్చాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట తడిసి ముద్దెంది..(కల్లూరి వెకంటేశ్వర్ రెడ్డి బోనూతల)
ఐదెకరాల్లో పత్తిని సాగు చేశా. పెట్టుబడి 1,50,000 లు అయింది.వానలకు పంట మొత్తం తడిసిపోయి రంగు మారింది. వ్యాపారులు దానిని కొనేందుకు ముందుకొస్తలేరు. అప్పులు చేసి పంటను సాగు చేశాను ఇప్పుడు పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి తమను ఆదుకోవాలి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -