నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని నర్సాపూర్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క మంజూరు చేసిన రూ.8లక్షల నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులను కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య సోమవారం ప్రారంభించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ కోరిక మేరకు మంత్రి సీతక్క ఈ నిధులను మంజూరు చేశారు. గ్రామం మెయిన్ రోడ్ నుండి మల్లన్న గుడి వరకు రూ.8లక్షలతో ఈ సిమెంట్ రోడ్డు పనులను చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ నర్సయ్య కొబ్బరికాయ కొట్టి సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం యాదవ సంఘ సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ను శాలువాలతో సత్కరించారు.
నిధుల మంజూరికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు నర్సాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పదిగేల ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మేండే నరేందర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ యాదవ్, లక్పతి యాదవ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జాగిర్యాల ఎర్రన్న యాదవ్, గ్రామ క్యాషియర్ కుమ్మరి శ్రీను, యాదవ సంఘం సభ్యులు జీవన్ యాదవ్, వెంకటేష్ యాదవ్, రాకేష్ మాదిగ, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.