- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
18న నిర్వహించే వివిధ పార్టీలు తలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై అన్నారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
- Advertisement -