Sunday, November 9, 2025
E-PAPER
Homeసినిమాపంచాయతీ సెక్రటరీ శ్రీరామ్‌గా శివాజీ

పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్‌గా శివాజీ

- Advertisement -

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌ పై రెండవ ప్రాజెక్టుగా సుధీర్‌ శ్రీరామ్‌ రచన, దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శివాజీ, లయ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు. ‘నైన్టీస్‌’ వెబ్‌ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్‌, అలీ, ధనరాజ్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్‌గా కనిపించనున్న శివాజీ ఎంతో నిజాయితీపరుడైన వ్యక్తి. తప్పుని సమర్ధించని మనస్తత్వం, అన్యాయాన్ని సహించలేని క్యారెక్టర్‌. తన వల్ల మాత్రమే కాదు, ఏ ఒక్కరి వల్ల కూడా జనం ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే మనిషి.

భార్యా బిడ్డలే ఇతని ప్రపంచం. వాళ్ళని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. వాళ్ళ దాకా వస్తే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడని మనిషి. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుండి పోస్టర్‌ విడుదలైంది. ఆ పోస్టర్‌ చూస్తుంటే గ్రామీణ వాతావరణంలో శ్రీరామ్‌ తన కుటుంబంతో కలిసి దీపావళి పండుగ చేసుకునేందుకుగాను పటాసులు తీసుకుని వెళుతున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రానికి నిర్మాత : శివాజీ సొంటినేని, రచన – దర్శకత్వం : సుధీర్‌ శ్రీరామ్‌, సంగీత దర్శకుడు : రంజిన్‌ రాజ్‌, ఎడిటర్‌ : బాలు మనోజ్‌.డి, కెమెరామెన్‌ : రిత్విక్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : ప్రసాద్‌ లింగం, ధీరజ్‌.పి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -