Saturday, October 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగాజాలో మారణాయుధాలుగా బిగ్‌ టెక్‌ కంపెనీలు

గాజాలో మారణాయుధాలుగా బిగ్‌ టెక్‌ కంపెనీలు

- Advertisement -

నిప్పుకు గాలి తోడైనట్టుగా, గాజాలో ఇజ్రాయిల్‌ జరిపిన నరమేధానికి, విధ్వంసానికి అమెరికా బడా టెక్‌ కంపెనీలు తోడయ్యాయి. ఇజ్రాయిల్‌ యుద్ధం యంత్రాంగంతో ఈ టెక్‌ కంపెనీల బంధం ఎంతలోతుగా, ధృఢంగా పెనవేసుకుని ఉన్నదో ఇటీవల బయటికొచ్చిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రపంచం ముందు నూతన ఆవిష్క రణలు, అభివృద్ధి అంటూ ప్రగతికాముక సంస్థలుగా నటించే ఈ కంపెనీల ‘అసలు రంగు’ ది గార్డియన్‌, +972 పత్రిక, లోకల్‌ కాల్‌ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడయ్యింది. ఇజ్రాయిల్‌ మిలటరీ గూడచారి విభాగం పేరు 8200, అది పాలస్తీనాలోనే ప్రతి ఒక్క పౌరుడి ఫోను సంభాషణను, రికార్డు చేసి, భద్రపరిచి, విశ్లేషించడానికి మైక్రోసాఫ్ట్‌కి చెందిన క్లౌడ్‌ ప్లాట్‌ఫారం అజూర్‌ను వాడుకున్నది.

8200, మైక్రోసాఫ్ట్‌తో చేసు కున్న భాగస్వామ్య ఒప్పందం వల్ల ఇజ్రాయిల్‌కు అపరిమితమైన నిఘా సామర్థ్యం కలిగింది. పాలస్తీనా ఆక్రమణలో లక్షలాదిమంది పాలస్తీనియన్ల వ్యక్తిగత ఫోను సంభాషణలు అజుర్‌ క్లౌడ్‌ ఫ్లాట్ఫామ్‌ మూలంగా ఇజ్రాయిల్‌కు ముడి సరు కుగా ఉపయోగపడ్డది. నిజానికి, మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యమే లేకపోయినట్టయితే ఇజ్రాయిల్‌ కంప్యూటర్‌ సర్వర్లకు భారీడేటాను భద్రపరిచి విశ్లేషించే శక్తి సామర్థ్యాలు లేవు. ఈ విషయం ఇజ్రాయిల్‌కు తెలుసు. అందువలనే ఇజ్రాయిల్‌ మైక్రోసాఫ్ట్‌ను ఆశ్రయించింది. క్లౌడ్‌ ఫ్లాట్‌ ఫామ్‌ వలన డేటా నిల్వ సామర్ధ్యం ”అనంతం”గా పెరిగింది. 1921లో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లను, ఇజ్రాయిల్‌ గూడచారి విభాగం 8200 కామాండర్‌ యెస్సి సరీల్‌ కలవటంతో ఈ ప్రాజెక్టు మొదలైంది.

అయితే, ఇజ్రాయిల్‌ సైన్యంతో మైక్రోసాఫ్ట్‌ కుమ్మ క్కవడం అనేది ఇది మొదటిసారి కాదు. 2025 జనవరిలో +972 మ్యాగజైన్‌ చేసిన పరిశోధనలో మైక్రోసాఫ్ట్‌ ఇజ్రాయిల్‌ సైన్యం మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని తెలిసింది, ఇజ్రాయిల్‌ సైనిక కార్యకలాపాలకు నేరుగా మద్దతు ఇచ్చే ప్రాజెక్టులలో అజుర్‌, ఓపెన్‌ ఏఐ( కృత్తిమ మేధ)ల సహ కారం ఉంది. ఇతర బిగ్‌ టెక్‌ మాదిరిగానే మైక్రోసాఫ్ట్‌ కూడా ఇజ్రాయిల్‌ ఆక్రమణ, అణచివేత సామూహిక హత్యలకు సాధ నంగా మారింది.అజుర్‌పై ఇజ్రాయిల్‌ సైనిక గూఢచారి విభాగమే కాదు, మిగతా అన్ని ఆర్మీ యూనిట్లు కూడా ఆధారపడ్డాయి. వైమానిక దళం ఓఫెక్‌ యూనిట్‌బీ మాట్స్‌పెన్‌ యూనిట్‌బీ మిలిటరీ నిఘా విభా గానికి వెన్నెముక లాంటి సపిర్‌ యూనిట్‌బీ పాలస్తీనియన్లపై విచారణను పర్యవేక్షించే మిలిటరీ అడ్వకేట్‌ జనరల్‌ కార్ప్స్‌ ఈ విధంగా అన్ని సైనిక విభాగాలు అజుర్‌ను చుట్టుకుని పనిచేస్తున్నాయి.

ఇలా ఇజ్రాయిల్‌ గాజా మారణహోమంలో తోడయింది మైక్రోసాఫ్ట్‌ ఒక్కటి మాత్రమే కాదు, గూగుల్‌, అమెజాన్‌ పలం టిర్‌ వంటి పెద్ద టెక్‌ కంపెనీలు ఈ మారణహోమం భాగస్వాములై డబ్బులు పోగేసుకున్నాయి. కానీ ప్రపంచం ముందు నూతన ఆవిష్కరణలు చేసి అభివృద్ధికి బాటలు వేసే కంపెనీలుగా గొప్పలు పోయే ఈ టెక్‌ కంపెనీలు వాస్తవంలో ఇజ్రాయిల్‌ యుద్ధ యంత్రాంగంలో అంతర్భాగం అయ్యాయి. ఈ టెక్‌ కంపెనీలు అమెరికా సైనిక- పారిశ్రామిక కూటమికి బయటకు ఆగుపడని వెన్నెముకలాగా పనిచేస్తున్నాయి. దీనికి తక్షణ ఉదాహరణగా, ప్రపంచం నడిబొడ్డున గాజాలో జరిపిన సామూహిక హత్యాకాండ మన కండ్లముందున్నది.ఇజ్రాయిల్‌తో అజుర్‌ కలవటంతో, మైక్రోసాఫ్ట్‌ వ్యాపారం వరకే పరిమితమైన చేతులు కట్టుకుని పక్కనే నిలబడే తటస్థ సంస్థగా లేదు. అది నేరుగా గాజా ఆక్రమణలో, నరమేధంలో చురుకైనా భాగస్వామి అయింది. మైక్రోసాఫ్ట్‌ కేవలం డబ్బులు తీసుకుని, సేవలందించే సంస్థ లాగా మాత్రమే పనిచేయ లేదు. అంతకుమించి ఇజ్రాయిల్‌ సంస్థలతో కలిసి టెక్నాలజీని అభివృద్ధి చేసి, స్థానిక నిఘా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఆ దేశంలో పరి శోధనా ప్రయోగ శాలలు నడుపు తున్నది. చివరికి పాలస్తీనాపై నియంత్రణలో ఇజ్రాయిల్‌ మైక్రోసాఫ్ట్‌ కంపెనీని వదులుకోలేని పరిస్థితి ఏర్పడింది.

గూగుల్‌, అమెజాన్‌ అండ్‌ నింబస్‌ ప్రాజెక్టు
ఈ వ్యవహారంలో మరో రెండు కంపెనీలు గూగుల్‌, అమెజాన్‌లు మైక్రోసాఫ్ట్‌ కంటే ఏమాత్రం వెనకబడి లేవు. ఈ కంపెనీలు ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో 120 కోట్ల డాలర్లతో ప్రాజెక్టు నింబస్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రాజెక్టు నింబస్‌ అంటే మరింత అభివృద్ధి పరిచిన క్లౌడ్‌ సదు పాయాలు, కృత్రిమ మేధ పరికరాలు అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టు. యంత్రాల ద్వారా ముఖాన్ని చూసి మనుషులను గుర్తించటం, భావోద్వేగాలను విశ్లేషించడం, శాంతి భద్రతల సమస్య ఎక్కడ తలెత్తుతుందో ముందుగానే గుర్తించడం ఈ ప్రాజెక్ట్‌ నిం బస్‌లో భాగం. ఇవి ఆస్పష్టమైన సామర్ధ్యాలు కావు, పాలస్తీనియా ప్రజల పై నిరంతరం నిఘా పెట్టగలిగిన సాంకేతిక సాధానాలు. ‘తూర్పు జెరూసలెంలో అనుమానితులు’ గురించిన డేటాను తయారు చేసి, వారిలో ఎవరి మట్టుబెట్టాలో జాబితా తయారు చేసివ్వటం నింబస్‌ ప్రాజెక్టులో భాగం.

పలంటీర్‌: డేటా ఆయుధ వ్యాపారి
గాజా మారణహోమంలో పాల్గొన్న మరో అమెరికా సంస్థ పలంటీర్‌.అమెరికా ప్రభుత్వపు అధికార గూఢచారి సంస్థ సిఐఏ పెట్టుబడితో, సహకారంతో ప్రారంభించబడిన పలంటీర్‌, ప్రస్తుతం అతి పెద్ద నిఘా సంస్థగా, మిలిటరీ గూఢచారి సంస్థగా పేరు తెచ్చుకున్నది. మైక్రో సాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌లు మౌలిక సదుపాయాలు అందిస్తే, పలంటీర్‌ విశ్లేషనాత్మక సాధనంగా పనిచేస్తున్నది. పాశ్చాత్య దేశాల గెలుపుకు తానే కారణమని గొప్పగా చెప్పుకుంటుంది పలంటీర్‌. ఇది ఇజ్రాయిల్‌ సైన్యానికి అందించే సేవలను విస్తృతంగా పెంచింది. ఇటువంటి వ్యవస్థలే పాలస్తీనా పౌరుల చావులను వేగవంతం చేశాయి. పలంటీర్‌ యుద్ధాలను ఆసరా చేసుకుని పెరిగి పెద్దది అయింది. ప్రతి కొత్త ఆకృత్యము తన సాధనాలు అమ్ముకునే అవకాశంగా చూస్తుంది.

‘లావెండర్‌’ హత్యల జాబితా తయారుచేయటం ఇష్టం
‘లావెండర్‌’ పేరుతో ఇజ్రాయిల్‌ కృత్రిమ మేధస్సుపై ఆధారపడిన ప్రోగ్రామును తయారు చేసింది. గాజాలో తొలి నాళ్లలో పాలస్తీనియన్లపై బాంబుల వర్షం కురిపించడంలో, హత్యలకు లక్ష్యాలను నిర్ణయించడంలోనూ లావెండర్‌ కృత్రిమ మేధను బాగా ఉపయోగించుకున్నారు. కృత్రిమ మేధ లావెండర్‌ చేసే నిర్ణయాలు పూర్తిగా మనుషులు చేసిన నిర్ణయాలు లాగానే ఉండేవి. ఇది వందల వేలమంది పాలస్తీనియాన్లను అనుమానా స్పద మిలిటెంట్లుగా పేర్కొని వారిని చంపే జాబితాను ఆటో మేటిక్‌గా తయారు చేస్తుంది. తర్వాత ఈ నిర్ణయాలు అమలై వేలాది మందిని పౌరులు బలే అయ్యారు.

చాట్‌జీపీటీ వంటి జనరేటివ్‌ ప్లాట్‌ఫార్మ్‌లను ఆదర్శంగా తీసుకుని, ఇజ్రాయిల్‌ ఇంటెలిజెన్స్‌ కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలి జెన్స్‌ టూల్స్‌ తయారు చేస్తోంది. వీటి పని నిఘా నిర్వహించటం, ఆరోపణలు సంధించటం, అరెస్టులను వేగవంతం చేయడం. ఇది గాజాలో జరుగుతున్న హత్యాకాండకు మాత్రమే పరిమితం కాదు, భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు, సమూహిక హత్యలకు పద్ధతిగా మారబోతున్నది.ఈ టెక్నాలజీలను అమెరికా పెద్ద టెక్‌కంపెనీలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఇది మనకు నాజీ జర్మనీలోని రసా యనాలు తయారుచేసే పెద్ద కంపెనీ, ఐ.జి. ఫారబెన్‌ను గుర్తు చేస్తుంది. ఆ కంపెనీ యూదులను, కమ్యూనిస్టులను, ”అవాంఛ నీయ వ్యక్తులు”గా లెక్క వేసినవారిని హతమార్చడానికి వాడిన విషవాయువుల ను తయారు చేసింది. యుద్ధం తర్వాత ఆ కంపెనీని విడగొట్టి, బిఏఎస్‌ఎఫ్‌, బేయర్‌ వంటి కంపెనీలుగా అవతారమెత్తాయి.

సామ్రాజ్యపు ప్రయోగశాలగా ఇజ్రాయిల్‌
ఈ విషయాలన్నింటి కలిపి చూస్తే,అమెరికా సామ్రాజ్యవాదానికి ఇజ్రాయిల్‌ ఒక ప్రయోగశాలలాగా మారిందనిపిస్తుంది.పాలస్తీనియన్లపై ప్రయోగించిన ప్రతి ఆక్రమణ పద్ధతి తరువాత ప్రపంచానికి ఎగుమతి అవుతోంది.ఉదాహరణకు, వెస్ట్‌ బ్యాంక్‌లో మొదట ఉపయోగించిన ”ప్రిడిక్టివ్‌ పోలీసింగ్‌” (అంటే ముందు గానే నేరాలను అంచనా వేసే సాఫ్ట్‌వేర్‌) ఇప్పుడు అమెరికా పోలీసు శాఖలకు అమ్ముతున్నారు. ఈస్ట్‌ జెరూసలెంలో మొదట ఉపయోగించిన బయోమెట్రిక్‌ చెక్‌ పాయింట్లు ఇప్పుడు అమెరికా-మెక్సికో సరిహద్దులో కనిపి స్తున్నాయి.గాజాలో పరీక్షించిన కృత్రిమ మేధ ఆధారిత నిఘా వ్యవస్థలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నియంత ప్రభుత్వాలకు అమ్ముతున్నారు. ఇజ్రాయిల్‌ బిగ్‌ టెక్‌ కంపెనీలకు (మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, పలాంటిర్‌) ఒకవైపు పెద్ద కస్టమర్‌, మరో వైపు ఆ కంపెనీలు తమ టెక్నాలజీలను పరీక్షించుకునే లేబరెేటరీ.ఈ కంపెనీలు ఇజ్రాయెల్‌ సైనిక వ్యవస్థలో భాగమై, అణచివేత టెక్నాలజీలను కలిసి అభివృద్ధి చేస్తాయి. తరువాత అవి ప్రపంచమంతా అమ్ము కునే ఉత్పత్తులవుతాయి.ఆ కారణంగా గాజాలో జరుగుతున్న విధ్వంసం కేవలం రాజకీయ ప్రాజెక్టు మాత్రమే కాదు. గూఢచర్యం, యుద్ధం, సామూహిక హత్యను వ్యాపారంగా మార్చే నమూనాగానూ మారింది.

ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
పాలస్తీనా విషయాలపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బానీస్‌ ఇప్పటికే హెచ్చరిక ఇచ్చారు. ఆమె మానవ హక్కుల మండలికి సమర్పించిన నివేదికలో, గాజాపై ఇజ్రాయిల్‌ చేసిన 21 నెలల దాడిలో అమెరికా బిగ్‌ టెక్‌ కంపెనీల పాత్రను వివరించారు. ఈ కంపెనీలు యుద్ధనేరాలకు అవసరమైన సాంకే తిక మౌలిక వసతులు, సేవలందించి, ఆ దాడులను సులభతరం చేశాయని ఆమె తెలిపింది.ఆమె నివేదిక ఒక స్పష్టమైన నిజాన్ని చెబుతుంది: బిగ్‌ టెక్‌ పక్కన నిలబడి చూసే సంస్థ కాదు, అది గాజా హత్యాకాండలో సామ్రాజ్యవాద యుద్ధ యంత్రంలో ఒక భాగంగా చురుకుగా పాల్గొంటున్న భాగస్వామి.

బిగ్‌టెక్‌కు అమెరికా యుద్ధ-పరిశ్రమకు మధ్య వీడని బంధం
ప్రపంచంలోని అతిపెద్ద టెక్‌ కంపెనీలు అమెరికా రక్షణ శాఖ (పెంటగన్‌)కు, గూఢచారి సంస్థ (ఎన్‌ఎస్‌ ఏ)కు బాగా విశ్వశించ దగిన కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నాయి. ఇదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు, అమెజాన్‌ వెబ్‌ సర్వీసు సీఐఏ డేటాను భద్ర పరు స్తుంది. మైక్రోసాఫ్ట్‌ అజుర్‌ అమెరికా రక్షణ వ్యవస్థలకు సాంకేతిక మద్దతు కల్పిస్తుంది.గూగుల్‌ సైనిక కృత్తిమ మేధ ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తుంది. పలంటీర్‌ గూఢచారి సంస్థల కోసం రూపొ ందించిన సాధనం.ఈ విధంగా, బిగ్‌ టెక్‌, సైనిక, పరిశ్రమల, గూఢచారి వ్యవస్థల కలయిక పూర్తయింది. ఇజ్రాయిల్‌ ఈ ప్రా జెక్టు ఒక ముఖం మాత్రమేబీ కానీ దీని వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. గాజా నుండి ఉక్రెయిన్‌ వరకు, బాగ్దాద్‌ నుండి శాన్‌ డియాగో వరకు, ఇవే కంపెనీలు పర్యవేక్షణ, లక్ష్యాల నిర్దేశన, ప్రజల నిఘా ద్వారా లాభాలు పొందుతున్నాయి.

ప్రతిఘటన- భవిష్యత్తు దారి
అయితే ప్రతిఘటన ఆగలేదు. కొనసాగుతోంది. గూగుల్‌, అమెజాన్‌లోని కొంతమంది ఉద్యోగులు ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు యుద్ధ లబ్దిదారులతో సంబంధాలు తెంచు కోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మానవ హక్కుల సంస్థలు ఈ కార్పొరేట్‌ నేరాలను ప్రపంచం ముందు పెడుతున్నాయి. పాలస్తీ నాలో ప్రజలు చూపిస్తున్న అచంచల పోరాటపటిమ,ఏ యంత్ర మేధస్సు తొలగించలేని ఆత్మస్థైర్యానికి నిదర్శనం. అయితే ఈ ప్రతిఘటన ఇంకా విస్తృతం కావాలి. ఒకప్పుడు ప్రజలు దక్షిణాఫ్రికాలోని వర్ణవివక్ష ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా చేసిన కంపెనీలను బహిష్కరించినట్లే, ఇప్పుడు మనం ఈ డిజి టల్‌ యుద్ధ వ్యాపారులను ఎదుర్కోవాలి.మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, పలంటీర్‌, ఇవి సాధారణ టెక్‌ కంపెనీలు కావుబీ డిజిటల్‌ యుగంలోని కొత్త ఆయుధ తయారీదారులు. జాతుల సామూహిక హత్యాకాండకు అవసరమైన సాంకేతిక వ్యవస్థలను నిర్మిస్తున్నారు.
(పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో)
అనువాదం: కర్లపాలెం

బప్పా సిన్హా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -