Saturday, October 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఇదేనా శిక్షణా?

ఇదేనా శిక్షణా?

- Advertisement -

నీతి, ధర్మం, సేవ, క్రమశిక్షణ గురించి నిత్యం బోధించే ఆరెస్సెస్‌ దాని వికృతరూపాన్ని బయట పెట్టుకుంది. ఇటీవల కేరళలో సాప్ట్‌వేర్‌ యువకుని ఆత్మహత్యతో ఆ సంస్థలో లైంగికదాడుల అరాచక పర్వాన్ని, దౌర్జన్యపు ధ్వంసనీతిని బహిర్గత పరిచింది. ఇరవై ఆరేండ్లున్న అనంతు సాజి అనే టెకీ సూసైడ్‌నోట్‌ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడటం విచారకరం. సంఫ్‌ు నాయకుడు నిధీóశ్‌ మురళీధరన్‌ తనను నాలుగు, ఐదేండ్ల వయస్సు నుంచే భౌతికంగా, మానసికంగా, లైంగి కంగా వేధిం పులకు గురిచేస్తున్నాడని నోట్‌లో చెప్పడం వారి నీచత్వానికి నిదర్శనం. అనంతుపై వివిధ క్యాంపుల్లో పలుమార్లు లైంగిక వేధింపులు కొనసాగించడం అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు ప్రతిబింబం. భారతీయ సంస్కృతికి పరిరక్షకులమంటూ చెప్పుకునే పరివారం ఈ దారుణానికి ఒడి గట్టడంలోనే వారి ఆచరణ ఎంత దుష్టత్వంతో కూడుకు న్నదో బయటపెడుతుంది. దాని సహజ సిద్ధాంత ప్రతిఫలం. దేశాన్ని రక్షించే పేరుతో కర సైనికులుగా బయట తిరుగుతూ కపటత్వ ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటు. ఇది సమాజంపైనే కాదు, ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న యువతపై కూడా తీవ్రంగా ప్రభావం చూపే చర్య. దీనికి బాధ్యత ఎవరిదన్న చర్చకన్నా అది సాగిస్తున్న ఆరాచకాలపై మాత్రం అప్రమత్త మవ్వాలి.

మతతత్వ జాఢ్యంతో ప్రజల మధ్య చిచ్చు రాజేసే సంస్థగా అసత్య ప్రేలాపనలతో, చరిత్ర వక్రీకరణలతో, విద్వేషాలను పెంచడంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ుకు మించిన దిట్ట వేరేలేరు. ఆధ్యాత్మికత, యోగా పేరుతో దాని పరివారం సమాజంలోకి చాపకింద నీరులా చొచ్చుకుపోతుంది. ఇట్టే ప్రజల మెదళ్లను కలుషితం చేస్తుంది. అనంతు ఆత్మహత్య వారిలో ఉన్న హింసా ప్రేరేపిత విధానాలను బహిర్గతం చేసింది. ”ఆరెస్సెస్‌ వారితో ఎవరూ స్నేహం చేయొద్దని, దానికి దూరంగా ఉండాలని, అదో విష పూరిత సంస్థ” అని వాపోవడం ఆలోచించాల్సిన అంశం. ఎంత మనో వేధనకు గురై ఉంటే ఈ విధంగా చెబుతాడు? ఆరెస్సెస్‌ గత కొన్నేండ్లుగా ‘పాత్ర నిర్మాణం’ పేరుతో యువతను తమ సిద్ధాం తాల వైపు లాగుతున్నది. కానీ ఆ శిబిరాల లోపల జరిగేది పాత్ర నిర్మాణం కాదు ఆలోచనల నాశనం. దేశాన్ని తిరో గమ నానికి తీసుకెళ్లే అశాస్త్రీయ భావ జాలం. శారీరక క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, భక్తి అనే ముసుగులో కఠిన మానసిక బంధనాలు పెడుతూ వారిని అనేక రకా లుగా హింసిస్తున్నది. తెలిసీతెలియక ఆకర్షితులైన విద్యార్థులు, యువకులు అందులోకి వెళ్లాక, అక్కడ సాగే దుర్మా ర్గాలు, వేధింపుల నుంచి బయటక పోవడానికి జరుగుతున్న పరిణామాలే సజీవ సాక్ష్యం.

ఇప్పుడు అనంతు అనుభవించింది కూడా అదే. తను పడిన మాన సిక వేదన ఎవరికీ చెప్పుకోలేకపోతున్నానని, చెప్పినా ఇక్కడ వినేవారు లేరని, మరో మార్గం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తను పెట్టిన వీడియోలో రోధించాడు. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే, భక్తి పేరుతే ఆరెస్సెస్‌ హిందుత్వాన్ని రుద్దుతూ పసి హృదయాల్లో విషబీజాలు నాటుతున్నది. విద్వేషాలను ప్రోది చేస్తున్నది. ఇది ఒక్క రాష్ట్రానికి పరిమితమైనది కాదు. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మతం, జాతి, దేశభక్తి అనే త్రిశూల వ్యూహాన్ని పట్టుకుని ప్రజలను మోహపరిచే ఆరెస్సెస్‌, తన అంతర్గత వ్యవస్థలో మాత్రం అణచివేత, పితృస్వామ్యం, లైంగిక దౌర్జ న్యాలకు క్షేత్రంగా చేసుకుంది. దీనికితోడు ప్రేమికుల దినోత్సవం రోజు బలవంతంగా పెండ్లిళ్లు చేయడం, సంస్కృతి సంప్రదాయాల పేరుతో వ్యక్తిగత భావజాలాన్ని వ్యాప్తి చేయడం కూడా ఇలాంటి ప్రేరేపిత చర్యలకు ఓ కారణం.

ఆరెస్సెస్‌ ఇటీవలనే శత వసంతాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కాషాయ కార్యకర్తలను వృత్తి సేవకులుగా ప్రశంసించారు. నిజమైన దేశభక్తులుగా కొని యాడారు. ఆయన చెప్పిన దానికి శిబిరాల్లో జరుగుతు న్నదానికి మాత్రం పూర్తి విరుద్ధం. ఈ ఆకృత్యాలు సంఫ్‌ుకు కొత్తేం కాదు. గతంలో బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఆ పార్టీకి చెందిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపైనే కేసు నమోదైంది. త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లాల్‌నాథ్‌ నిండు శాసనసభలో నీలి చిత్రాలు చూస్తూ పట్టుపడ్డాడు. వారి మాతృసంస్థలో నేర్పే ఇంగితజ్ఞానం ఇదేనా? భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే దేశంలో చిచ్చు రాజేసి ఎన్నో మరణాలకు ఆజ్యం పోసిన ఈ విద్వేషపాలనలో సభ్యత, సంస్కారం ఉంటుందని ఆశించ గలమా? నైతిక విలువలకు తావుంటుందని అనుకోగల మా? ఇకనైనా పౌర సమాజం ఆలోచించాలి. సనాతన ధర్మం పేరుతో అరాచకత్వానికి తెగబడుతున్న వీరి ఆగడాలను గమనించాలి, ప్రశ్నించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -