అవినీతిపై యువత ఆగ్రహం
పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి
ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
లిమా : ప్రపంచాన్ని కుదిపేస్తున్న జన్ జడ్ ఉద్యమం లాటిన్ అమెరికా దేశం పెరుకి వ్యాపించింది. ఆ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జన్ జడ్ పేరుతో యువత గత కొన్ని వారాల నుండి పోరాడుతుంది. రాజధాని లిమాలో కాంగ్రెస్ ముందు జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో ” మేము యువకులం..అవినీతి, హింసతో విసిగిపోయాం ” అంటూ నినదించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు మృతి చెందాడు, అనేక మంది గాయపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం ఆ దేశ ప్రధాన మంత్రి ఎర్నెస్టో అల్వారెజ్ లామాలో ఎమర్జెన్సీని విధిస్తున్నామని ప్రకటించారు. పెరు దేశంలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. నిరుద్యోగంతో యువత విసిగిపోయింది. నేరాలు అదుపులేకుండా పోవడంతో పెరువియన్లలో అభద్రత పెరిగిపోయింది. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలంకావడంతో వేలాది మంది ప్రజలు తమ నిరసనలు తెలుపుతున్నారు.
ఆగ్రహానికి కారణం ఏంటి….
ఉపాద్యాయుడు అయిన వామపక్ష పార్టీ నాయకుడు పెడ్రో కాస్టిల్లో 2021వ సంవత్సరంలో ఫ్రీ పెరు పార్టీతో కలిసి పోటి చేసి గెలిచారు. ” ధనిక దేశంలో పేదలు, అట్టడుగు ప్రజలకు ప్రాతానిధ్యం ” అనే నినాదంతో పెట్రో దేశ అధ్యక్షుడిగా గెలిచి సంచలనం సృష్టించారు. ఉచిత విద్య, ఉచిత క్యాన్సర్ చికిత్స, చిన్న రైతుల ఆదాయాలు పెంచేందుకు కృషి చేశారు. అయితే ఇది సహంచని మితవాద శక్తులు 2022లో కుట్ర చేసి పెట్రోను అభిశంసించి పదవి నుండి తోలగించారు. అప్పటి నుండి పెరు రాజకీయ అస్తిరతను ఎదుర్కోంటుంది. గత 9 సంవత్సరాల్లో 7 అధ్యక్షులు మారారు. దీనికి తోడు దేశంలో అవినీతి, హింస పెరిగిపోయాయి. రౌడీ ముఠాలు స్థానిక వ్యాపారులు, బస్ డ్రైవర్లు, సామాన్యుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
నిరావరించిన వారిపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి. చదువుకున్న యువతు ఉపాది గగనమైపోయింది. దీంతో పెరు యువత ఆగ్రహించింది. తక్షణమే ప్రభత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలను ఉదృతం చేసింది. దీంతో అధ్యక్షురాలు దీనా బోలువార్టే పదవి నుండి తప్పించారు. తరువాత తాత్కాలిక అధ్యక్షుడైన జోస్ జెరి జన్ జడ్ యువతను తీవ్రవాదులగా అభివర్ణించడంతో వారు మరింత ఆగ్రహించారు. దేశంలో అవినీతి, అసమానతలు, అభద్రత తొలగనంతకాలం ప్రజాగ్రహం చల్లారదని, అధ్యక్షుడు జెరి ప్రజా వ్యతిరేక చర్యలతో దేశంలో అశాంతి నెలకొనే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.