Saturday, October 18, 2025
E-PAPER
Homeబీజినెస్రిలయన్స్‌ ఇండిస్టీస్‌కు రూ.22,092 కోట్ల లాభాలు

రిలయన్స్‌ ఇండిస్టీస్‌కు రూ.22,092 కోట్ల లాభాలు

- Advertisement -

క్యూ2లో రూ.2.59 లక్షల కోట్ల రెవెన్యూ
న్యూఢిల్లీ :
ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లాభాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 14 శాతం వృద్ధితో రూ.22,092 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.19,323 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.2.35 లక్షల కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ2లో రూ.2.59 లక్షల కోట్లకు పెరిగింది. రిలయన్స్‌ అప్పులు 1 శాతం పెరిగి రూ.1.19 లక్షల కోట్లకు చేరాయి.గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలో రిలయన్స్‌ జియో రెవెన్యూ 4 శాతం పెరిగి రూ.36,332 కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.35,032 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. ఇదే సమయంలో రూ.7,110 కోట్లుగా ఉన్న లాభాలు.. గడిచిన క్యూ2లో 4 శాతం పెరిగి రూ.7,379 కోట్లకు పెరిగింది. ‘గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆయిల్‌, జియో, రిటైల్‌ వ్యాపారాల నుంచి బలమైన సహకారంతో మెరుగైన పనితీరును కనబర్చాము. ఏకీకృత లాభాలు 14.6 శాతం పెరిగాయి. ఇది చురుకైన వ్యాపార కార్యకలాపాలకు నిదర్శనం. భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక వృద్ధిని ప్రతిబిం బిస్తుంది.” అని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -