Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది. ఇంకో రెండు నెలల్లో ఉద్యోగంలో చేరబోతున్న యువకుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళ్తే.. నిమ్స్‌లో నితిన్‌ బీఎస్సీ అనస్థీషియా టెక్నీషియన్‌ ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాడు. గురువారం రాత్రి విధులకు హాజరైన అతను అర్ధరాత్రి ఎవరికీ కనిపించలేదు. శుక్రవారం ఉదయం ఆపరేషన్‌ థియేటర్‌లో విగతజీవిగా పడి ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గమనించింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోటీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నితిన్‌ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఇంకో రెండు నెలల్లో కోర్సు పూర్తవుతుందనగా, భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నాడన్నారు. ఇంతలో ఇలాంటి ఘటన జరగడంతో కన్నీటి పర్యంతమయ్యారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట సీఐ రామకృష్ణ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి గాయాలూ కనబడలేదని, సూసైడ్‌ నోట్‌ కూడా లభించలేదని అన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణం తెలుస్తుందన్నారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డా.బీరప్ప స్పందిస్తూ.. తమ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న నితిన్‌ మృతిచెందడం చాలా బాధాకరం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -