- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో శనివారం అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది.
- Advertisement -