Tuesday, August 11, 2026
E-PAPER
Homeజాతీయం‘డ్రగ్ ఫ్రీ తమిళనాడు’: సీఎం విజయ్ ప్రతిజ్ఞ

‘డ్రగ్ ఫ్రీ తమిళనాడు’: సీఎం విజయ్ ప్రతిజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడును డ్రగ్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం విజయ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ‘డ్రగ్‌ ఫ్రీ తమిళనాడు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చెన్నైలో విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సమాజం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సీఎం విజయ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -