Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజూరాల ప్రాజెక్టు వద్ద పోలీసుల పహారా..

జూరాల ప్రాజెక్టు వద్ద పోలీసుల పహారా..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. సోమవారం జూరాల ప్రాజెక్టు సందర్శనకు బీఆర్‌ఎస్ నేతలు పిలుపునికచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు బీఆర్‌ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆత్మకూరు, అమరచింత, మదనాపురం మండలాల్లో బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని వ్యవసాయ క్షేత్రం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయనను వనపర్తి ఇంటికి తరలించారు. జూరాల ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -