హీరో కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంది’ అని మేకర్స్ అన్నారు. ఈ మూవీ విజయవంతమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’ఈ దీపావళికి నాకు మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. మేము ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ప్రెస్ షో చూసిన మీడియా మిత్రులు కాల్ చేసి మేము బాగా నవ్వుకున్నాం అని చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడున్న కాంపిటీషన్‌లో ఇంతమంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. పండక్కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి, చిన్న మెసేజ్ ఇవ్వాలి, ఒక వైబ్ మూవీలో ఉండాలని చేసిన ప్రయత్నమిది. సినిమా రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే విషయాన్ని క్లియర్‌గా చెప్పాం.
మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు. ‘మా సినిమాను కేవలం నవ్వించడం కోసమే తీశామని మేము చెబుతూ వస్తున్నాం. ఇలాంటి సినిమాలో లాజిక్స్ వెతకకూడదు. మీడియా వాళ్లు మా సినిమాకు రేటింగ్స్ తక్కువగా ఇచ్చారు. అయితే నేనేం బాధపడటం లేదు. అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం. కానీ కొందరు కావాలనే మా మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు. ట్విట్టర్ రివ్యూస్‌లో ఫుల్ రివ్యూ కు మధ్యలో గంటలు గంటలు గ్యాప్ ఇస్తారు. రేటింగ్ సాయంత్రం వరకు ఇస్తారు. కానీ మా సినిమాకు మాత్రం ఏం అన్నా పడతారు, చిన్న ప్రొడ్యూసర్ కదా అనుకున్నట్లు ఉన్నారు. కానీ ఈ దీపావళికి రిలీజైన మూవీస్‌లో ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి నిజాలు తెలుసుకోవాలి. హైదరాబాద్‌లో చాలా థియేటర్స్‌లో షోస్ ఫుల్ అవుతున్నాయి. అలాగే వైజాగ్, ఈస్ట్‌లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. షో, షో కు కలెక్షన్స్ పెరుగుతున్నాయి’ అని నిర్మాత రాజేశ్ దండ తెలిపారు.
ఊహించినదాని కంటే మించి..
- Advertisement -
- Advertisement -