ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పట్టణం జగదేవ్ పూర్ చౌరస్తాలోని ఎడమవైపు ఉన్న చిరు వ్యాపారులకు శాశ్వత మాడిగేలు కట్టించి ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని కోరారు. ఆదివారం రోజున జగదేవ్ పూర్ చౌరస్తా లోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపానకు వచ్చిన అనిల్ కుమార్ రెడ్డి కి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ చిరు వ్యాపారులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. జగదేవ్ పూర్ × రోడ్ లోని చిరు వ్యాపారుల డబ్బాల వెనుక గల సిసి బ్యాంకు వారి ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే కిరాయిలు చెల్లిస్తారని, నిరుపేదలైన చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ భువనగిరి అభివృద్ధి లో భాగంగా జగదేవ్ పూర్ రోడ్ ను వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారులు తమ డబ్బాలను కొద్దిగా సెట్ బ్యాక్ చేసుకోవాలని, డబ్బాలు తొలగించే ఆలోచన లేదని ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు చిరు వ్యాపారల అధ్యక్షులు గుర్రాల శీను, ఉపాధ్యక్షులు మంద బాబు, ఎం డి జియాఓద్దీన్ ప్రధాన కార్యదర్శి కిషన్ లాల్ సహాయ కార్యదర్శి స్వప్న కోశాధికారి ఎండి ఖలీల్, నాయకులు గుర్రాల పాండు, సామల జంగయ్య, ఎండీ సాజిద్, ఆంజనేయులు, హెరెకర్ చోటు, మహేష్ లు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులకు శాశ్వత మడిగేలు కట్టించి ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES