నవతెలంగాణ – హైదరాబాద్ : దీపావళి పండుగను మెగాస్టార్ చిరంజీవీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని తన నివాసంలో టాలీవుడ్ ప్రముఖులతో పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, నయనతార పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే మనశివశంకరవరప్రసాద్‌గారు మూవీ నుంచి సూపర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మీసాల పిల్లా అంటూ సాగే పాటను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో దూసుకెళుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
మెగాస్టార్ ఇంట దీపావళి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES