- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
సోమవారం దీపావళి పండుగ వేళ మద్నూర్ మండల కేంద్రం కిక్కిరిసిన జనాలతో కళకళలాడింది. దీపావళి పండుగ సందర్భంగా జనాలు మండల కేంద్రానికి తరలివచ్చి పండుగకు కావలసిన పూజా సామాగ్రి కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. పండ్లు ఫలాలు స్వీట్లు పువ్వులు పూజా సామాగ్రి కిరాణా వస్తువులు కూరగాయలు తదితర అన్ని రకాల వ్యాపారాలు జోరుగా కొనసాగాయి. కిక్కిరిసిన జనాలతో మండల కేంద్రం సోమవారం జన సమూహంగా కనిపించింది.
- Advertisement -