Wednesday, October 22, 2025
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో విద్యుత్ అంతరాయం

అశ్వారావుపేటలో విద్యుత్ అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణ పరిధిలో బుధవారం విద్యుత్ నుండి శనివారం వరకు ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని మంగళవారం విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

పట్టణంలో రోడ్డు విస్తరణ లో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్స్ పై 33 కేవీ, 11 కేవీ ,ఎల్.టీ తీగలు అమర్చే పనులు చేపడుతున్నందున బుధవారం నుండి శనివారం వరకు ( 22/10/2025 నుండి 25/10/2025 )  వినాయకపురం రోడ్ (పోలీస్ స్టేషన్ నుండి పెద్ద రైస్ మిల్), ఓల్డ్ ఆంధ్రాబ్యాంక్ వీధి, దండాబత్తుల బజార్,గాంధీ బొమ్మ సెంటర్,ముస్లిం బజార్, చిన్నంశెట్టి బజార్, తూర్పు బజార్, వడ్డెర బజార్, అంబేద్కర్ నగర్, గౌడ బజార్, తిరుమల నగర్, శివయ్య గారి బజార్ మరియు గుర్రాల చెరువు రోడ్ లో  విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -